Home > Featured > యాదాద్రి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రాలు

యాదాద్రి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రాలు

CM Kcr

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధి పనులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఆలయాన్ని అన్ని హంగులతో తీర్చి దిద్దుతున్నారు. ఆలయంలో రాతి స్తంబాలపై పలు చిత్రాలను చెక్కి అందరిని ఆకట్టుకునేలా చేస్తున్నారు. వీటిల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని కూడా చేర్చారు. మరో వెయ్యేళ్ల పాటు కేసీఆర్ ప్రజలకు గుర్తుండేలా చేయాలనే తాము ఇలా చెక్కినట్టు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర పక్షి నెమలి, జంతువు కృష్ణ జింక, తెలంగాణ సంక్షేమ పథకాల చిహ్నాలను కూడా చేర్చారు. ప్రత్యేకంగా తెప్పించిన కృష్ణ శిలలపై ఆధ్యాత్మిక చిహ్నాలను చెక్కారు. తెలంగాణ చరిత్రను, సంస్కృతిని తెలిసేలా చేస్తున్నామన్నారు.

Updated : 6 Sep 2019 2:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top