సీఎం కేసీఆర్ నేడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆయనతోపాటు మరో ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ లు సీఎం కేసీఆర్ వెంట మరికొన్ని గంటల్లో యాదగిరి గుట్టకు రానున్నారు. నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగబోతున్న సంగతి తెలిసిందే. అంతకు ముందే నలుగురు సీఎంలు యాదగిరిగుట్టలో దర్శనం చేసుకోనున్నారు.
ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి యాదగిరిగుట్టకు రెండు హెలికాప్టర్లలో బయల్దేరి 11:30 గంటలకు గుట్టకు చేరుకుంటారు. సీఎంలకు స్వాగతం పలికేందుకు యాదాద్రి ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలిప్యాడ్ వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుట్టపైకి వెళ్తారు.ఇక గుట్టపై దేవాలయం ప్రాంగణం వద్ద అర్చకులు వారికి పూర్ణకుంభం అందించి స్వాగతం పలుకుతారు. నలుగురు సీఎంలు స్వయంభూ లక్ష్మీ నారసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రులకు అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వచనం చేస్తారు.
ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుట్టలో 1600 మంది పోలీసు బలగాలను మోహరించారు. అనంతరం 12:30 గంటలకు గుట్ట నుంచి హెలికాప్టర్లో ఖమ్మం బహిరంగ సభకు వెళ్తారు. సీఎంల టూర్ నేపథ్యంలో.. భద్రతా కారణాల దృష్ట్యా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనం, ఆర్జిత సేవలకు అనుమతి లేదని ఆలయ ఈవో రెండు రోజుల క్రితమే తెలిపారు.
ALSO READ: ‘నాతో చేతకాక.. నా కొడుకుపై కేసు పెట్టిస్తావా..?’ కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
మీరు సుకన్య సమృద్ధి స్కీంలో చేరాలనుకుంటున్నారా..అయితే మీకు గుడ్‌న్యూస్..!
ఉప్పల్ వేదికగా కివీస్‌తో టీమిండియా తొలి వన్డే నేడు
తండ్రిని మించిన తనయుడు.. బండి సంజయ్ కొడుకుపై ఆర్టీవీ కామెంట్స్