ఉత్కంఠ... కాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్కంఠ… కాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్

April 12, 2022

mmmm

వడ్ల పంచాయితీపై కేంద్రానికి 24 గంటల గడువు విధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై కేబినెట్ మంత్రుతో భేటీ నిర్వహిస్తున్నారు. వడ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు కొనాలి, ఎవరు హామీ ఇస్తారని ఉత్కంఠ నెలకొన్ని నేపథ్యంలో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. భేటీ తర్వాత సీఎం విలేఖర్ల సమావేశం నిర్వహించనున్నారు. వడ్ల కొనుగోలుపై కేంద్రం నుంచి విస్పష్ట ప్రకటనేదీ రాకపోవడంతో ఆయన ఏ ప్రకటన చేస్తారనన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఎలాంటి ప్రతిఘటన చర్య తీసుకుంటారు? ఈ సమస్యకు ఏ పరిష్కారం చూపుతారని అటు రైతులతోపాటు, ఇటు మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది.