CM KCR Pressmeet In Delhi...
mictv telugu

ఢిల్లీకి ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్..! అక్కడి నుంచే కేసీఆర్…

October 27, 2022

CM KCR,Delhi Tour,Pressmeet,FarmHouse Issue

ఫామ్‌హౌజ్ ప్రకంపం ఢిల్లీని తాకబోతోంది.తెలంగాణ నుంచి సీన్ దేశరాజధానికి మారబోతోంది.ఇక్కడి నుంచే సీఎం కేసీఆర్ ఈ ఎపిసోడ్ పై మాట్లాడే అవకాశం వుంది.జాతీయ స్థాయిలో బీజేపీని ఎండగట్టాలని యోచిస్తున్నారు.

హైదరాబాద్ టు ఢిల్లీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు. మూడురోజుల పాటు అక్కడే వుంటారు. జాతీయ స్థాయి నేతలు, ప్రాంతీయ పార్టీల నేతల్ని కలుస్తారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై ఢిల్లీ నుంచే మాట్లాడబోతున్నారు. ఇక్కడి నుంచే బీజేపీ కుట్రలు చేస్తుందని,,ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చెప్పే అవకాశం వుంది. తొలుత గురువారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు. కానీ ఇక్కడే నుంచి కాకుండా ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ నిర్వహించాలనుకుంటున్నారు. ఢిల్లీ వేదికగా మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.

ఛాలెంజ్ పై స్పందించే ఛాన్స్

యాదాద్రిలో ఛాలెంజ్‌కు రావాలంటోన్న బీజేపీ సవాల్ పై మాట్లాడొచ్చని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఈ ఎపిసోడ్ పై నేతలు ఎవరూ మాట్లాడొద్దని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కోరారు. అందుకే టీఆర్ఎస్ నాయకులు సైలెంట్ అయ్యారు.ఢిల్లీ వేదికగా కేసీఆరే అన్ని విషయాలు మాట్లాడతారని తెలుస్తోంది.

అటు కుమారస్వామి డిమాండ్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కోరారు. ఈ ఎపిసోడ్ పై టీఆర్ఎస్‌కు మద్దతు వుంటుందంటున్నారు.వాళ్లను పంపిందెవరో తేల్చాల్సిందేనని అంటున్నారు.

ఫామ్‌హౌజ్‌లో..

ఫామ్ హౌజ్ ఎపిసోడ్ దేశంలో సంచలనంగా మారింది. బుధవారం మొహనాబాద్ అజీజ్‌నగర్‌లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ కొనుగోళ్ల ఎపిసోడ్ కు వేదికైంది. సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి, నందు, సింహయాజులు ఇక్కడకు వచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్దన్ రెడ్డితో సమావేశమయ్యారు. బీజేపీలో చేరితే రూ.100 కోట్లు ఇప్పిస్తామని రామచంద్రభారతి ఆఫర్ చేశారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ సమాచారాన్ని పోలీసులకు ఎమ్మెల్యేలు ముందే చెప్పారు. ఎమ్మెల్యేల సమాచారంతో ఫామ్‌హౌజ్ పై రైడ్ చేసిన పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్‌లో ఎక్కడ బీజేపీ పేరును పోలీసులు ప్రస్తావించలేదు.