ప్రగతి భవన్ చేరుకున్న కేసీఆర్  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రగతి భవన్ చేరుకున్న కేసీఆర్ 

July 11, 2020

CM KCR reached Pragati Bhavan

రాష్ట్రంలో కరోనా కేసులు ఉదృతంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో సోషల్ మీడియాలో పెద్ద దూమారమే చెలరేగింది. ‘వేర్ ఈజ్ కేసీఆర్’ అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయింది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా విమర్శలు చేసింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలపాలని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైన విషయం తెలిసిందే. అంతేకాదు ఏకంగా ఇద్దరు యువకులు ప్రగతిభవన్‌లోకి దూసుకుపోయి నిరసన తెలిపారు.

ఇన్ని పుకార్ల మధ్య అందరికీ షాక్ ఇస్తూ శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. గత రెండు వారాలుగా ఫామ్‌‌హౌస్‌లో ఉన్న ఆయన.. తాజాగా ప్రగతి భవన్‌కు వచ్చారు.  ప్రగతి భవన్‌లో అభివృద్ధి పనులపై, కరోనా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు ఒకటి రెండు రోజుల్లో రైతులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.