CM KCR remembered his connection with Krishna
mictv telugu

మీరు కూడా అలా చేస్తారా? అని క‌ృష్ణగారు అడిగారు – కేసీఆర్

November 15, 2022

CM KCR remembered his connection with Krishna

సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో ఆయనతో తనకున్న అనుబంధాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మంగళవారం కృష్ణ గారి పార్థీవ దేహానికి నివాళులు అర్పించి.. మహేశ్ బాబును ఆయన ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను కృష్ణ గారి ఆతిథ్యం మేరకు ఈ ఇంటికి చాలా సార్లు వచ్చానని, విజయ నిర్మల గారు చనిపోయినప్పుడు కూడా వచ్చానని గుర్తు చేశారు.

లెజండరీ యాక్టర్ మన మధ్య లేకపోవడమేది చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను ఓ మంచి మిత్రుడిని కోల్పోయానని నిర్వేదం వ్యక్తం చేశారు. ఎలాంటి అరమరికలు లేకుండా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అని, ఎంపీగా దేశానికి సేవలు చేశారని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు గొప్ప సినిమా అని, తాను చాలా సార్లు చూశానని చెప్పారు. ఇదే విషయాన్ని కృష్ణగారితో చెబితే.. ఏంటి మీరు కూడా సినిమాలు చూస్తారా? కేసీఆర్ గారు అని ప్రశ్నించారని తెలిపారు. దేశ భక్తి పెంపొందించే చిత్రాలు తీసిన ఆయనకు గౌరవార్ధం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించానని వెల్లడించారు. మహేశ్ బాబు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పానని, భగవంతుడు వారికి దుఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.