ఢిల్లీ నుంచి వచ్చి రాగానే సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ నుంచి వచ్చి రాగానే సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్

October 20, 2022

Cm Kcr Review meeting On Present Situation In Telangana state

 

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ అంత్యక్రియల కోసం యూపీ వెళ్లిన సీఎం కేసీఆర్.. అటు నుంటి అటు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. వివిద కారణాల వల్ల ఎనిమిది రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్.. బుధవారం మధ్యాహ్నం తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. వచ్చి రాగానే వెంటనే ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ ప్రపంచ హరితనగరంగా పురస్కారం పొందడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తంచేశారు. అధికారులకు అభినందనలు తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన సమీక్ష నాలుగోరోజూ కొనసాగింది. హరిత నగర ఖ్యాతిని నలుదిశలా చాటేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన సూచించారు.

మీటింగ్‌లో.. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మరోవైపు.. మునుగోడులో ఉప ఎన్నికల ప్రచార అంశం కూడా చర్చించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు.. గొర్రెల పంపిణీపై సీఈసీ విధించిన ఆంక్షల గురించి కూడా సీఎం చర్చలో ప్రస్తావించినట్టు సమాచారం. అయితే.. ఢిల్లీ నుంచి వచ్చీ రాగానే సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించటం వల్ల ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.