cm kcr review on the solution of dharani problems in tTelangana
mictv telugu

ధరణి , గురుకుల విద్యాలయాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

July 5, 2022

cm kcr review on the solution of dharani problems in tTelangana

రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ధరణి సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చిస్తున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్లో సరైన ఆప్షన్లు లేక రైతులు, యజమానులు హక్కులకోసం తిప్పలు పడుతున్నారు. పట్టా భూమిని అసైన్డ్‌గా చూపడం, చాలా జిల్లాల్లో ఇనాం భూముల సర్వే నంబర్లు, ఖాతాలు అసలు ధరణిలో లేకపోవడం.. ఇలా దాదాపు చాలా కీలక సమస్యలున్నాయి. వీటి పరిష్కారంపై సీఎం ఇవాళ సమీక్ష నిర్వహించారు.

దీంతోపాటు రాష్ట్రంలోని గురుకుల విద్యాల‌యాల‌ను ఇంట‌ర్మీడియ‌ట్ స్థాయికి ఉన్న‌తీక‌రించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స‌ర్కిళ్ల‌ను ఉపాధి అందించే శిక్ష‌ణా కేంద్రాలుగా మార్చి నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డం, త‌దిత‌ర విద్యా సంక్షేమ అంశాల‌పై ముఖ్య‌మంత్రి ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.