Home > Featured > మోదీతో నాకెలాంటి విభేధాలు లేవు..కానీ: సీఎం కేసీఆర్

మోదీతో నాకెలాంటి విభేధాలు లేవు..కానీ: సీఎం కేసీఆర్

ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ అసత్య ఆరోపణలు చేస్తున్నాని, తాము వేసిన ప్రశ్నలకు హైదరాబాద్‌ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా పర్యటన నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయంలో సిన్హాకు కేసీఆర్ స్వాగతం పలికారు. అనంతరం జలవిహార్‌లో కేసీఆర్ అధ్యక్షతన యశ్వంత్ సిన్హాకు మద్దతుగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెలిపారు. ప్రధానిగా కాకుండా… దేశానికి సేల్స్‌మెన్‌గా మోదీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

మేక్‌ ఇన్‌ ఇండియా అనేది శుద్ధ అబద్ధమని కేసీఆర్ అన్నారు. మోదీ పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిందని… జీడీపీ పడిపోయిందని తెలిపారు. మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. శ్రీలంక విషయంలో స్పందించకుంటే మాత్రం ప్రధానిని దోషిగానే చూడాల్సి వస్తుందని చెప్పారు. ప్రధాని ఈ విషయంపై స్పందించే వరకు తాము మౌనంగా ఉండమని.. పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

Updated : 2 July 2022 3:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top