CM KCR said that the Center brought the electricity reform bill without consulting any states.
mictv telugu

మోటార్ల‌కు మీట‌ర్లు పెట్ట‌నీయం.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

September 12, 2022

సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లు- ప‌ర్యావరణాల‌పై చ‌ర్చ‌ను ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడుతున్నారు. కేంద్రం, రాష్ట్రాల‌కు మ‌ధ్య దూరం పెరిగింద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో రాష్ట్రాలు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నాయ‌న్నారు. ఏ రాష్ట్రాల‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌కుండానే కేంద్రం విద్యుత్ సంస్క‌ర‌ణ బిల్లు తీసుకువ‌చ్చింద‌ని, దీంతో రైతుల పొలాల వ‌ద్ద ఉండే క‌రెంటు మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు.

దీన్ని తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌తిరేకిస్తోంద‌ని, తాను బ‌తికి ఉన్నంత కాలం రైతుల పొలాల వ‌ద్ద మోటార్లు పెట్ట‌నీయ‌బోన‌న్నారు. దీనిపై ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు మాట‌ల‌ను కోట్ చేస్తూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వ తీరు, బీజేపీ తీరును అసెంబ్లీ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. కొంత‌మంది లీడ‌ర్ల కేంద్రం మీట‌ర్లు పెట్ట‌డం లేద‌ని చెబుతున్నార‌ని, కానీ, ఏపీలోని శ్రీ‌కాకుళం జిల్లాలో త‌మ ఎమ్మెల్యేల బృందం ప‌రిశీలించగా.. అక్క‌డ పంట పొలాల‌కు మీట‌ర్లు పెట్టిన విష‌యం వెల్ల‌డ‌య్యింద‌న్నారు. దీనికి బీజేపీ లీడ‌ర్లుకానీ, కేంద్ర ప్ర‌భుత్వం కానీ ఏం స‌మాధానం చెబుతుందో చూడాల‌న్నారు సీఎం కేసీఆర్‌. కాగా, అంత‌కుముందు ఇటీవల చ‌నిపోయిన‌ పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు నిమిషాలపాటు సభ సంతాపం తెలిపింది.