Cm Kcr Started To Nanded From Hyderabad To Attend Brs Party Meeting
mictv telugu

నాందేడ్‌కు బయల్దేరిన సీఎం కేసీఆర్..

February 5, 2023

Cm Kcr Started To Nanded From Hyderabad To Attend Brs Party Meeting

ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గంతో భేటీ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌ కాసేపటి క్రితం మహారాష్ట్రలోని నాందేడ్‌కు బయల్దేరారు. ప్రగతి భవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు పయనమయ్యారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం అనంతరం.. రాష్ట్రంలో కాకుండా తొలిసారిగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ బహిరంగ సభనిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్‌ నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు.

మరికాసేపట్లో నాందేడ్‌కు చేరుకోనున్నారు కేసీఆర్‌. మొదట సభా వేదిక సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నాందేడ్‌లోని చారిత్రక గురుద్వారాకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు జాతీయ, మహారాష్ట్ర మీడియా ప్రతినిధులతో భేటీ అవుతారు. 5 గంటలకు నాందేడ్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.