CM KCR to meet HD Kumaraswamy on Sunday amid talks of national party launch
mictv telugu

నేడు సీఎం కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం భేటీ

September 11, 2022

నేడు సీఎం కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ కానున్నారు. ఇరువురు నేతలు ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం భోజనం తర్వాత ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. కేసీఆర్ ఇప్పటికే బెంగళూరు వెళ్లి… మాజీ ప్రధాని దేవగౌడ, కుమారస్వామితో చర్చించారు. జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీల నేతలతో చర్చించారు. భాజపాను గద్దె దించేందుకు కలిసి రావాలని వివిధ పార్టీల నేతలను కోరారు. ఇక, ఈ ఏడాది చివరిలో కర్ణాటకలో అసెంబ్లీ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌తో భేటీ కానుండటం.. ప్రాధాన్యత సంతరించుకుంది.