రేపు యాదాద్రి సందర్శించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

రేపు యాదాద్రి సందర్శించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

September 29, 2022

సీఎం కేసీఆర్‌ రేపు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారం విరాళం ఇవ్వనున్నారు. శుక్రవారం ఉ 10.30 గంటలకు సతీసమేతంగా సీఎం కేసీఆర్.. ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో యాదాద్రికి బయలుదేరి 11.30 గంటలకు చేరుకుంటారు. లక్ష్మీనారసింహుడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. యాదాద్రి క్షేత్రంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాత మ.3 గంటలకు యాదాద్రీ దేవాలయం నుంచి ప్రగతి భవన్ బయలుదేరుతారు.

సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని ఆలయ నిర్మాణ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, భక్తులు… స్వామివారికి పసిడి సమర్పించారు. సీఎం కేసీఆర్‌ రేపు బంగారాన్ని విరాళం ఇవ్వనున్నారు. ఆలయ ప్రారంభోత్సవం తరువాత కేసీఆర్ యాదాద్రి రావడం ఇదే తొలిసారి.