CM KCR unveiled the statue of Gandhi at Gandhi Hospital
mictv telugu

గాంధీ ముందు గాంధీని ఆవిష్కరించిన కేసీఆర్

October 2, 2022

ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ జాతిపితకు నివాళులర్పించారు. అంతేకాక, హైద్రాబాదులోని గాంధీ ఆస్పత్రి ముందు కొత్తగా నిర్మించిన 16 ఫీట్ల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఎంజీరోడ్‌లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ‘కరోనా సమయంలో గాంధీ వైద్యులు విశేష కృషి, సేవలందించారు. మంచి జరిగితే తప్పక ప్రశంసలు వస్తాయి. మహాత్ముడు పుట్టిన దేశంలో పుట్టడం మన అదృష్టం. ఆయన ఏం చేసినా అద్భుతమే. ఆయన జీవితం గొప్ప సందేశం. పల్లె, పట్టణ ప్రగతికి ప్రేరణ గాంధీయే. ఆయన చూపించిన మార్గంలోనే తెలంగాణ సాధించాం. ఈ మధ్య నామాటలు వేదాంత ధోరణిలో ఉన్నాయంటున్నారు. ప్రపంచంలో శాంతి ఉంటేనే మనం సుఖంగా ఉంటాం. లేకపోతే ఆటవికమే. ఈ మధ్య గాంధీని కించపరిచే మాటలు వింటున్నాం. అలాంటప్పుడు బాధ కలుగుతుంది’ అని వ్యాఖ్యానించారు.