యాదాద్రికి 125 కిలోల బంగారం విరాళం.. కేసీఆర్ వాటా ఎంతంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

యాదాద్రికి 125 కిలోల బంగారం విరాళం.. కేసీఆర్ వాటా ఎంతంటే..

September 30, 2022

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయానికి సీఎం కేసీఆర్ దంపతులు చేరుకున్నారు. వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తన తరపున స్వామి వారి గర్భగుడి దివ్య విమానానికి బంగారం తాపడం కోసం ఒక కిలో 16 తులాల బంగారాన్ని తన మనవడు హిమాన్షు చేతుల మీదుగా అందించారు. మొత్తం తాపడం కోసం 125 కిలోల బంగారం అవసరం కాగా, రూపాయల్లో లెక్కిస్తే సుమారు 65 కోట్లవుతుందని అంచనా. అందులో ఇప్పటివరకు 6 కిలోల 617 గ్రాముల బంగారం, 19 కోట్ల 38 లక్షల 17 వేల నగదు సమకూరింది. మిగతా మొత్తం సమకూరాక రిజర్వ్ బ్యాంక్ నుంచి స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. అటు ఆలయంలో కొనసాగుతున్న వివిధ పనుల పురోగతిపై అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై ఆరా తీశారు. సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తదితరులు ఉన్నారు.