CM KCR will visit Bihar on 31st of this month
mictv telugu

31న బీహార్‌కు సీఎం కేసీఆర్.. బాధిత కుటుంబాలకు పరామర్శ

August 29, 2022

CM KCR will visit Bihar on 31st of this month

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనకు ఈ నెల 31న వెళ్లనున్నారు. అక్కడ సీఎం నితీష్ కుమార్‌తో భేటీ కానున్నారు. పట్నాలో నితీష్‌తో లంచ్ చేసి జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఎన్డీఏ వ్యతిరేక పక్షాలను కూడగట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ది చెప్పాలని భావిస్తున్న కేసీఆర్ వీలు చిక్కినప్పుడల్లా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

అలాగే చైనాతో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలను పరామర్శించనున్నారు. కల్నల్ సంతోష్ బాబు ఆ ఘటనలోనే వీర మరణం పొందిన విషయం తెలిసిందే. బీహార్ రెజిమెంట్‌కు కల్నల్ సంతోష్ బాబు నాయకత్వం వహించారు. దీంతో గతంలో అమర జవాన్లకు ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అందజేయనున్నారు. అంతేకాక, సికింద్రాబాద్‌ టింబర్ డిపోలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించి 12 మంది బీహార్ వలస కూలీలు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను కూడా సీఎం కేసీఆర్ పరామర్శించి నితీష్ కుమార్‌తో కలిసి ఆర్ధిక సహాయం చెక్కులు అందజేస్తారు.