సీఎం కేసీఆర్ ఈ నెల 14న జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పర్యటనకు వెళ్లనున్నారు. దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.100 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక అభివృద్ధి పనులను చేట్టేందుకు గాను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు ముఖ్యమంత్రి కొండగట్టులో పర్యటించనున్నారు. అంజన్న క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చిస్తారు. అనంతరం పూర్తి వివరాలు ప్రకటిస్తారు.
ఇక నేడు ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి పునర్నిర్మాన ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి వెళ్లనున్నారు. సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికను ఈ సందర్భంగా ఆయన రూపొందించనున్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో కొండగట్టు అంజన్న ఆలయం యాదాద్రితరహాలో అభివృద్ధి చెందుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శాభావం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను జగిత్యాల ఎస్పీ భాస్కర్ పరిశీలించారు.