CM KCR wished the Governor tamilisai a happy birthday
mictv telugu

గవర్నర్‌ తమిళిసైకి సీఎం కేసీఆర్ బర్త్‌డే విషెస్

June 2, 2022

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసైకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న గవర్నర్ పుట్టినరోజు కావడం విశేషం. ఈ నేపథ్యంలో కేసీఆర్ శుభాకాంక్షలతో పాటు ఇంకొన్ని సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా, గత కొంతకాలంగా ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో మొదలైన ఈ వివాదం గవర్నర్ ప్రొటోకాల్ వరకు వెళ్లింది. ఈ క్రమంలో పలువురు మంత్రులు కూడా గవర్నర్‌ను విమర్శించారు. అంతేకాక, గవర్నర్ నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున ఎవరూ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తెలపడంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది.