మొద‌టి నుంచి ఉన్నవారంటే కేసీఆర్ కు చాలా ఇష్టం -కవిత - MicTv.in - Telugu News
mictv telugu

మొద‌టి నుంచి ఉన్నవారంటే కేసీఆర్ కు చాలా ఇష్టం -కవిత

May 29, 2017

పేదల ఆకలి తీర్చాలని నిజామాబాద్ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఫుడ్ క‌మిష‌న్‌ సభ్యుల బాధ్య‌త‌ల స్వీకారోత్స‌వంలో ఆమె పాల్గొన్నారు.

పేద‌ల ఆక‌లి తీర్చే అవ‌కాశం ల‌భించిన ఫుడ్ క‌మిష‌న్ స‌భ్యులు అదృష్ట‌వంతుల‌ని అభినందించారు.
సోమ‌వారం హైద‌రాబాద్ ర‌వీంద్ర భార‌తిలో ఫుడ్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ కొమ్మ‌ల‌ తిరుమ‌ల్ రెడ్డి, స‌భ్యులు వోరుగంటి ఆనంద్‌, కె. గోవ‌ర్ధ‌న్ రెడ్డి, రంగినేని శార‌ద‌, భానోత్ సంగూలాల్‌, మ‌ట‌కుంట్ల భార‌తిలు బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఆహార భ‌ద్ర‌త చ‌ట్టాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తూ.. పేద‌ల ఆక‌లి తీర్చేందుకు కృషి చేయాల‌ని కవిత కోరారు. వృత్తిరీత్యా న్యాయ‌వాదులు అయినందునే ఫుడ్ క‌మిష‌న్‌లో మీకంద‌రికి ముఖ్య‌మంత్రి కేసిఆర్ అవ‌కాశం క‌ల్పించార‌న్నారు. 2001 నుంచి ఉన్న వారిని సిఎం గుర్తుపెట్టుకుని క‌మిష‌న్‌లో పేర్ల‌ను స్వ‌యంగా రాశార‌ని క‌విత చెప్పారు.

త‌న‌తో మొద‌టి నుంచి ఉన్న వారంటే కేసిఆర్‌కు అపార‌మైన ప్రేమ ఉందని, ఆయ‌న అధ్భుత‌మైన జ్ఞాప‌క శ‌క్తి క‌లిగిన గొప్ప నాయ‌కుడ‌న్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో త‌న‌ను క‌లిసిన వారు ఎప్పుడు, ఎక్క‌డ క‌లిశారు, ఏం మాట్లాడారు అనే విష‌యాలు సీఎంకు గుర్తున్నాయ‌న్నారు. పాత‌,కొత్త‌ల మేలు క‌లయిక‌తో టిఆర్ ఎస్ పార్టీ తిరుగులేని శ‌క్తిగా ఎదిగింద‌ని క‌విత చెప్పారు.