డబ్బుల చెల్లింపులో ఆలస్యం వద్దు - MicTv.in - Telugu News
mictv telugu

డబ్బుల చెల్లింపులో ఆలస్యం వద్దు

June 10, 2017


ఇంట్లో ఉన్న ధాన్యం ఎవరు కొనడం లేదా.. కల్లంలో ఉన్నది అలాగే ఉందా.. వ్యాపారులు కొనేందుకు వెనకాడుతున్నారా..సర్కార్ కాంటాకు అమ్మితే డబ్బులు త్వరగా రావడం లేదా… ఇక ఆ కష్టాలు అక్కర్లేదు.. ఎంతైనా కొంటారు. కొనాల్సిందే.. ఈ భరోసా ఇస్తున్నది ఎవరంటే..?

రాష్ర్టంలో ఈసారి పంట బాగా పండింది. కానీ కొనడానికి వ్యాపారులెవరూ ముందుకు రావడం లేదు. వచ్చినా గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. దీంతో ధాన్యం అమ్మడంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ తెలుసుకున్న సీఎం కేసీఆర్ ..ధాన్యం సేకరణపై సమీక్ష జరిపారు. ఎంత ఖర్చు అయినా కూడా వెనుకాడవద్దు అని అధికారుల్ని ఆదేశించారు.ధాన్యం సేకరణ విషయంలో ఎప్పటికప్పుడు రైతులకు చెల్లింపులు జరపాలన్నారు. సివిల్ సప్లయ్స్ కొనుగోలు కేంద్రాలకు రికార్డు స్థాయిలో ధాన్యం వస్తుందన్నారు. ఎంత ధాన్యమైన సేకరించడానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. డబ్బుల పంపిణీ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా రైతులకు చేరే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటికే 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, మొత్తం రూ. 5,300 కోట్లు కాగా ఇప్పటికే రూ. 4 వేల కోట్లు చెల్లించామని అధికారులు సీఎంకు చెప్పారు. చెల్లించాల్సిన బకాయి మొత్తం రూ. 1000 కోట్లను తక్షణమే చెల్లించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన డబ్బులు వచ్చే దాకా ఎదురుచూడకుండా రూ. 1000 కోట్లను సమకూర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున బ్యాంక్ గ్యారంటీ ఇస్తామన్నారు. ఖరీఫ్ పెట్టుబడులకు రైతులకు డబ్బులు అత్యవసరమని, రైతుల చెల్లింపులపై ఎక్కువ దృష్టి సారించాలని కేసీఆర్ అధికారులకు చెప్పారు.