కొత్త చైర్మన్లు ఎవరెవరంటే... - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త చైర్మన్లు ఎవరెవరంటే…

May 29, 2017

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత స్పీడందుకున్నారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన కేసీఆర్…మూడేళ్ల సంబురాలకు సమయం ఆసన్నమైన వేళ నామినేటెడ్ పోస్టుల భర్తీకి తెరతీశారు. 8 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. వాళ్లు ఎవరెవరంటే…

కార్పొరేషన్లు, ఛైర్మన్ల వివరాలు :

1. తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తూముకుంట నర్సారెడ్డి (గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే)
2. వుమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా మాజీ ఎంపీ గుండు సుధారాణి (వరంగల్ జిల్లా)
3. తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మడుపు భూమ్ రెడ్డి (మెదక్ జిల్లా)
4. తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా గాంధీ నాయక్ (వరంగల్ జిల్లా)
5. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్, టివి అండ్ థియేటర్ డెవలప్ మెంట్ చైర్మన్ గా పుష్కర్ రామ్మోహన్ రావు (ఆదిలాబాద్–మందమర్రి)
6. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కే వాసుదేవ రెడ్డి (కేయూ విద్యార్థి నాయకుడు)
7. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ (గోషామహల్)
8. తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ చిరుమిల్ల రాకేశ్ కుమార్ (ఓయు విద్యార్థి నాయకుడు–పెద్దపల్లి)లను సీఎం నియమించారు.

అదేవిధంగా టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాజీ ఎంపి గుండు సుధారాణి (వరంగల్ జిల్లా), తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అధ్యక్షుడిగా ఓయూ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాసయాదవ్ (కరీంనగర్ జిల్లా) ను నియమించారు.