రైట్ టైమ్ సీఎం సారూ..ఎవర్నీ వదలొద్దు..బొక్కలో వేయాల్సిందే..! - MicTv.in - Telugu News
mictv telugu

రైట్ టైమ్ సీఎం సారూ..ఎవర్నీ వదలొద్దు..బొక్కలో వేయాల్సిందే..!

July 15, 2017

వాళ్లేం సమాజ సేవకులు కాదు…సంఘ సేవా చేయడం లేదు. డబ్బుల కోసం వేషాలు వేస్తున్నారు. ఉత్తగానే జనాలకు ఎంటరైన్ మెంట్ ఏమి ఇవ్వడం లేదు. వేషాలతో కోట్లు సంపాదిస్తున్నారు. డ్రగ్స్ గ్రిగ్స్ అంటూ తలతిక్క వేషాలు వేస్తున్నారు. వీళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించ వద్దు..దొరికిన వాళ్ల భరతం పట్టాలి. బొక్కలో వేసి మత్తు దిగేదాకా కుళ్ల బొడవాలి..మళ్లీ డ్రగ్స్ అంటేనే వణికి చావాలి. కలుగులో దాక్కున్న దొరకని దొంగల్ని వెలికితీయాలి. వాళ్ల పని పట్టాలి. తెరపై హీరోగా చెలరేగిపోయే సోగ్గాళ్లు..విలువల్లో జీరోలు. బయటకూడా హీరోల్లామనే ఫీల్ అయిపోయే డ్రగ్స్ దొంగలకు దడ పుట్టించాలి. ఇప్పుడు కొట్టే దెబ్బకు మిగతా వాళ్లు పోసుకోవాలి. తొలి దెబ్బ ఏలా ఉండాలంటే ..మరో వందేళ్లు ఆ మాట ఎత్తకుండా..ఆ దారి దాపుల్లోకి వెళ్లకుండా ఉండాలి. జనం కూడా ఇదే కోరుకుంటున్నారు.

పరువు పోతుంది..పరువు పోతుంది. రహస్యంగా విచారణ చేయండి.. పేర్లు బయటకు వెల్లడించొద్దు..సినీ పెద్దలు తెలంగాణ సర్కార్ పై తెస్తున్న ఒత్తిడి ఇది..గల్లీ నుంచి ఢిల్లీ లెవల్లో తెస్తున్నారు. అయినా సీఎం కేసీఆర్ సార్…మరో మాట ఆలోచించ వద్దు. అరెరె సినిమా వాళ్లు..మన వాళ్లే కదా.. పోనీలే అనుకుంటే..మాత్రం…తెలంగాణ భవిష్యత్ పై దెబ్బ పడ్డట్టే..ఎందుకంటే డ్రగ్స్ అంటే మామూలు విషయం కాదు..ఒక్కసారి వదిలేస్తే టాలీవుడ్ నే కాదు తెలంగాణ ని కమ్మేస్తోంది. మత్తులో ముంచేస్తోంది. బంగారు తెలంగాణేమోగానీ.. ఫిలప్పీన్స్ లా కావొచ్చు..ఇప్పడు వదిలేస్తే..సినిమావాళ్లు అలాగే చేస్తారు..ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గొద్దు..తెలంగాణ సమాజం ఇదే కోరుకుంటున్నది.

వీళ్ల సినిమాలేవి ప్రపంచాన్ని ఉద్దరించవు. సమాజాన్ని ఏమి నడిపించవు. కనీసం ఆలోచించేలా కూడా తీయరు..కోట్ల డబ్బులు పోస్తారు. రెట్టింపు డబ్బులు సంపాదిస్తారు.ఇలా వచ్చిన డబ్బుల్లో పావులా కూడా తెలంగాణ బాగు కోసం,,రైతుల కోసం గానీ పెట్టిన పాపాన పోలేదు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న సందర్భాల్లేవ్. వాళ్లంటే పడిసచ్చే అభిమానులు…కన్నీళ్లు పెట్టుకున్నప్పుడూ తెలిసినా తుడిచే ప్రయత్నం చేయలేదు..మానవత్వం మచ్చుకైనా లేని మరో ప్రపంచం..కాదు కాదు మత్తు ప్రపంచం వీళ్లది..

అథ్లెట్స్ డోపింగ్ టెస్ట్ లో దొరికితే..వాళ్లు దేశం కోసం ఆడుతున్నారని ఏం ఉపేక్షించడం లేదు..తప్పు తప్పే కదా అని చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ల పేర్లు అస్సలు దాయడం లేదు..బహిరంగంగానే విచారణ ఎదుర్కొనేలా చేస్తున్నారు. మరి దేశం కోసం ఆడే క్రీడాకారుల కన్నా…మేకప్ వేసుకునే జీరోలు గొప్పా..?

అబ్బబ్బో ఇలాంటోళ్లు లేకపోతే..సినిమాలు ఏవీ ఆగవు..పూరీ మాడిపోతే.. సంకల్పం ,సత్తా ఉన్న సంకల్ప్ లు వందలాది మంది ఉన్నారు. చాన్సులు రాక అదిరిపోయే షార్ట్ ఫిలిం లు తీస్తూ ఫిల్మ్ నగర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రవితేజలు గివితేజలు కాకపోతే మరో వంద మంది టాలెంట్ ఉన్న నటులు పుట్టుకువస్తారు. నటనకు వారసత్వం అక్కర్లేదు..బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ బోన్స్ లేకున్నా..చిన్న చిత్రాల్లో ఎంతో మంది అద్భుతంగా చేస్తున్నారు.గమ్ముత్తులో జోగుతున్న డ్రగ్ స్టార్ల కన్నా… అప్ కమింగ్ స్టార్స్ ను  ఎంకరేజ్ చేయాలి..ఇప్పుడే సరైన సమయం. ఆలోచిస్తే మరెప్పటికి ఇలాంటి అవకాశం రాదు.

మైకంతో తూలుతున్న సెలబ్రిటీల తాట తీయాల్సిందే. ఫొటోలు, వీడియోల్లాంటి ఆధారాలున్నప్పుడు అస్సలు ఆలోచించవద్దు. డ్రగ్ వ్యాపారి కెల్విన్ తో సంబంధాలు ఉన్న బడాబాబుల్ని బయటకు గుంజాలి.పార్టీల్లో , ఫంక్షన్లలో కంపల్సరీ డ్రగ్స్ వాడుతున్నవారిని వదల బొమ్మాళీ నిన్నొదల అంటూ మత్తు దించాలి.

ఒత్తిడి తెస్తున్న సినీ పెద్దల మాట వింటే తెలంగాణ సమాజానికి ద్రోహం చేసినట్టే.. మత్తులో ఉన్నది మనవాళ్లే కదా వదిలేస్తే…రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి చేస్తున్నోళ్లు..డ్రగ్స్ కేసుల్లో ఉన్నారేమో చూడాలి. ముందుగా వాళ్లను బొక్కలో వేయాలి. నోటీసులందుకున్నవారిని కటకటాల్లోకి పంపాలి. మిగతా బడాబాబుల సంగతి తేల్చాలి..వీళ్లని లోపల వస్తే సినీ పరిశ్రమ ఏం సంక్షోభం లో పడదు. మంచి వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లను చేరదీయండి..చేస్తే వాళ్లను ఎంకరేజ్ చేయండి…కానీ మత్తులో జోగుతున్న వాళ్లకు..వారికోసం ఒత్తిడి తెచ్చే పెద్దల్ని దారిదాపుల్లోకి రానీయకండి సీఎం కేసీఆర్ సారూ..

ఇన్నాళ్లు సినిమాల్లో తెలంగానోళ్లని ఎదగకుండా చేసినోళ్లు ఇప్పుడు దొరికారు. తెలంగాణ అంటే చిన్నచూపు ఉన్నవాళ్లు మత్తుతో మన కాళ్లు ముందు వంగారు. పనికిమాలిన డైలాగులతో తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేసినోళ్ల కు బ్యాండ్ బాజా మోగాలి.వందలాది మంది తెలంగాణ కోసం అమరులైనా..వాళ్ల కుటుంబసభ్యుల్ని పలకరించింది లేదు..సాయమూ చేసింది లేదు..పైగా వెటకారపు మాటలు..ఇప్పడు అసలు సిసలైన తెలంగాణోడి దెబ్బ ఎందో చూపాలి. మంచి వాళ్లకు మేమున్నాం అని భరోసా ఇవ్వండి.

హైదరాబాద్ లో పేకాట క్లబ్ లు లేకుండా చేసినట్టే ఇప్పుడు చేయండి..డ్రగ్స్ రహిత హైదరాబాద్ ను చేయాలి. భాగ్యనగరం ప్రపంచ సిగలో నిలిచేలా ఆలోచించాలి. ఇప్పుడే రైట్ టైమ్ సీఎం కేసీఆర్ సార్ ..ఎవర్ని వదలొద్దు..డ్రగ్స్ కేసుల్లో అందని బొక్కలో వేయాల్సిందే..తెలంగాణ సమాజం అంతా ఇదే కోరుకుంటుంది. బంగారు తెలంగాణలో భాగం అనుకోండి…