ఆ పేరు చెబితే సీఎం కేసీఆర్ గజగజ వణికిపోతారు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆ పేరు చెబితే సీఎం కేసీఆర్ గజగజ వణికిపోతారు..!

July 8, 2017

ఢిల్లీకి రాజైనా తల్లీకి కొడుకే. తెలంగాణకు సీఎం అయినా…ఆ విషయంలో మాత్రం కేసీఆర్ ఇంకా చిన్న పిల్లాడే..ఒకే ఒక్కటి ఆయన్ని భయపెడుతోంది. దాని దగ్గరకి వచ్చే సరికి ఏవేవో వంకలు చెబుతున్నారు. రేపు మాపు అంటూ మరిపిస్తారు. లోలోపల తెగ ఖుషీ అవుతారు. అందరినీ భయపట్టే తెలంగాణ టైగర్ ను ఏం భయపెడుతుందో తెలుసా..?

సుస్తీ చేస్తే దవాఖానాకు పోతాం..డాక్టర్ రాసి ఇచ్చే మందులు, ఇంజక్షన్ తీసుకుంటాం. చిన్న పిల్లలు హాస్పిటల్ అంటే సూది వద్దని ఏడుపు మొదలుపెడతారు.గల్లీ గల్లీ అదిరియేలా ఏడ్చేస్తారు. అమ్మో నాకు సూది మందు వద్దు అని మొత్తుకుంటారు. ఇంకాస్త పెద్ద పిల్లలైతే ఇంకా ఏవోవో సాకులు చెప్పి తప్పించుకుంటారు. మందుగోలీలు మింగుతా గానీ సూది మందు వద్దని కండీషన్ పెడతారు.అలా అయితేనే ఆసుపత్రి గడప తొక్కుతారు. ఇంకొందరైతే సూది మందు భయంతో అక్కడకు రావాలంటేనే పారిపోతారు..

ఇట్లాగే సీఎం కేసీఆర్ సార్ కు సూది మందు అంటే తెగ భయమట. అందుకే ఆసుపత్రి అంటే ఏవో వంకలు చెబుతారట.కేసీఆర్‌ కుడి కంటికి శుక్లం రావడంతో దాన్ని తొలగించడానికి చిన్నపాటి లేజర్‌ ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు సూచించారు.ఆపరేషన్ కు మొదట్లో ఒప్పుకోని ఆయన ..కుటుంబసభ్యుల బలవంతంతో చివరకు వోకే అన్నారు. కానీ ఆపరేషన్ దగ్గరి వచ్చేసరికి రకరకాల కారణాలు చెబుతున్నారట. పిల్లాడి కంటే ఎక్కువ వంకాలు చెబుతున్నారట.

ఇలా తప్పించుకోవడానికి అసలు కారణాలను కేసీఆర్ ..ఎంపీలతో పిచ్చాపాటిగా మట్లాడుతూ చెప్పేశారు. తనకు సూది మందంటేనే భయమని, వీలైనంత మేరకు మందు బిళ్లలతోనే రోగాలను నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తానడంతో ఎంపీలంతా ఆశ్చర్యపోయారు. వేటికీ భయపడని మీరు.. ఒక్క సూది మందుకు భయపడతరా సారూ! అని ఎంపీలు ప్రశ్నించారు. ఈ విషయం ఎవరితో గట్టిగా చెప్పకండి. మా ఇంట్లో వాళ్లకుకూడా తెలియదు. మీరు చెబితే బలవంతంగా ఆపరేషన్‌ చేయిస్తారని అని కేసీఆర్‌ బదులివ్వడంతో అంతా నవ్వేశారు.

సో పిల్లాడిలా సీఎం కేసీఆర్ కు సూది మందంటే ఎంత భయమో తెలిసింది కదా.సారూ.. ఇప్పుడు మీరు సీ ఎం …మీరే ఇలా కారణాలు చెప్పారని పిల్లలకు తెలిస్తే వాళ్లు మాట వింటారా…అస్సలు వినరు..నెత్తిన ఎక్కి కూర్చుంటారు.అందుకే సారూ…ఎట్లైనా ధైర్యం తెచ్చుకోండి..సూది వేయించుకోండి.. కంటి ఆపరేషన్ చేయించుకోండి..లేదంటే పిల్లలు మాట వినరు..వాళ్ల కోసమైనా భయాన్ని పక్కన పెట్టండి..ఆల్ ది బెస్ట్ సారూ…