ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో లో తెలిసినోడే లీడర్..! ఆయనే సీఎం కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో లో తెలిసినోడే లీడర్..! ఆయనే సీఎం కేసీఆర్

July 12, 2017

అవును ఈ టైటిల్ తెలంగాణ సీఎం కేసీఆర్ చక్కగా సూటవుతుంది. పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేసినా కొందరు లీడర్లు వెనకేసుకొస్తారు. లోపల గుర్రుగా ఉన్నా బయట పడకుండా మేనేజ్ చేస్తారు. కానీ సీఎం కేసీఆర్ అలా చేయలేదు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనన్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సీరియస్ అయ్యారు. జరిగిన సంఘటన పట్ల ఆవేదనను వ్యక్తం చేసిన కేసీఆర్… ప్రవర్తన సరిగా లేదని ఎమ్మెల్యేని మందలించారు.వెంటనే వెళ్లి కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని సూచించారు.

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా ఐఏఎస్ ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ ను కలిసి గురువారం ఆమె ఫిర్యాదు చేయనున్నారు. ఈ లోపే విషయం తెలుసుకున్న కేసీఆర్… మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వం, పార్టీ తరఫున సముదాయించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.