CM KCR’s visit to Kondagattu postponed to Wednesday,Here’s The reason
mictv telugu

సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా… కొత్త షెడ్యూల్ ఇదే

February 14, 2023

CM KCR’s visit to Kondagattu postponed to Wednesday,Here’s The reason

ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా పడింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించేందుకు.. సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 14న (మంగళవారం) వెళ్లాలని ముందుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు.. ఆలయంలో చేపట్టాల్సిన పునః నిర్మాణ పనుల గురించి చర్చించేందుకు వెళ్లాలనుకున్నారు. అయితే.. నేడు మంగళవారం కావడంతో.. స్వామి వారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ పర్యటన భక్తులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ రోజు పర్యటనను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారని స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఓ ప్రకటనలో చెప్పారు.

కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల రూ.100 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్‌ రేపు ఆలయానికి చేరుకుని అంజన్న క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనపై అధికారులతో చర్చిస్తారు. అనంతరం పూర్తి వివరాలు ప్రకటిస్తారు. కాగా.. సీఎం కేసీఆర్ పర్యటనకు ముందు కొండగట్టులో ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పర్యటించారు. ఆలయాన్ని పూర్తిగా పరిశీలించి అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది.