ఢిల్లీలో కరోనా తగ్గుముఖం..ఒక్క కొత్త కేసూ నమోదు కాలేదు - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో కరోనా తగ్గుముఖం..ఒక్క కొత్త కేసూ నమోదు కాలేదు

March 24, 2020

vfc

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఢిల్లీలో లాక్ డౌన్ సత్ఫాలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ‘కరోనా సోకినవారిలో ఐదుగు వ్యక్తులు కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కొత్త కేసులు నమోదు కావడంలేదు. అయితే మేం దీన్ని చూసి సంతోషంగా లేము. పరిస్థితి చేయి దాటి పోకుండా చూడటమే ఇప్పుడు మన ముందు ఉన్న అతిపెద్ద సవాలు’ అని కేజ్రీవాల్‌ మీడియాతో తెలిపారు. ఇప్పటివరకు ఢిల్లీలో 30 మందికి కరోనా పాజటివ్‌గా తేలింది.