సీఎంపై చెప్పులు విసిరిన బీజేపీ కార్యకర్త   - MicTv.in - Telugu News
mictv telugu

సీఎంపై చెప్పులు విసిరిన బీజేపీ కార్యకర్త  

February 21, 2018

యథా రాజా తథా ప్రజా అని సామెత. రాజకీయ నాయకులు నీతి తప్పుతుంటే తాము మాత్రం తక్కువ తింటామా అని జనం కూడా దారి తప్పుతున్నారు. ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడానికి చెప్పులను, చీపుర్లను అందుకుంటున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై చెప్పుల దాడి జరిగింది. ఆయనపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేకపోయినా ఎందుకో బాగానే కోపమొచ్చింది.మంగళవారం రాత్రి బార్‌ఘర్ జిల్లాలో ఈ ఉదంతం జరిగింది. తర్వలో జరిగే బేజీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కుంబారి గ్రామంలో జరిపిన సభలో నవీన్ ప్రసంగించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి చెప్పులను ఆయనపై విసిరేశారు. అయితే ముఖ్యమంత్రి ఒడుపుగా వాటి నుంచి తప్పించుకున్నారు. భద్రతాసిబ్బంది వెంటనే ఆయనను పక్కకు తీసుకెళ్లారు. చెప్పులు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని చితగ్గొట్టారు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి.