బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చడానికి అస్సలు ప్రయత్నించలేదని రాష్ట్రాభివృద్ది లో తలమునకలై వున్న తనకు అంత తీరిక లేదని సీఎం నితీష్ కుమార్ సెలవిచ్చారు. అంతే కాదు తాను వదిలేసిన తర్వాత లాలూకు వేరే పని పాట లేదని, అందుకే కాంగ్రెస్ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తే వారు తన గుప్పెట్లోకి వస్తారని ఇలాంటి కట్టు కథలు అల్లి కాలక్షేపం చేసుకుoటున్నాడు అని ఎద్దేవా చేశారు.
బిహార్ లో మహా కూటమి ని కాదని బీజేపీ తోక పట్టుకుని నితీష్ జులై లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బిహార్ లో కాంగ్రెస్ కి 27 మంది, ఆర్ . జె . డి కి 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు నితీష్ తమ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి తమ పార్టీ లను చీల్చే కుట్ర చేస్తున్నాడని వీరి ఆరోపణ. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దీనిపై గత వారం తన పార్టీ రాష్ట్ర అద్యక్షుడు అశోక్ చౌదరి, మరో నేత సదానంద చౌదరిలను పిలిపించారు.
నితీష్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కలిసి ఎన్నడూ లేనంతగా వాళ్ళ నియోజక వర్గాల గురించి ఆరా తీసినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అశోక్ చౌదరి మహాకుటమి అధికారo లో ఉన్నప్పుడు కీలక శాఖలో మంత్రిగా పని చేశాడు. మంత్రి పదవి పోవడంతో దిక్కు తోచక 19 ఎమ్మెల్యేలను కూడేసుకుని పాలక పక్షం చంక కిందకు దూరెందుకు భారీ చీలిక కోసం ప్రయత్నిస్తుట్టు ఆయన విమర్శకుల ఆరోపణ. ఛీ… సిగ్గు శరం లేని రాజకీయాలు.