రేషన్‌కు బదులు నగదు! - MicTv.in - Telugu News
mictv telugu

రేషన్‌కు బదులు నగదు!

October 21, 2017

కేంద్రంలోని మోదీ సర్కారు.. సబ్సిడీ పథకాలన్నింటికీ నగదు బదిలీని వర్తింపజేస్తోంది. దీని వల్ల అక్రమాలు తగ్గుతున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా దీనిపై దృష్టి సారించారు. రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న బియ్యం, తదితర నిత్యావసరాలకు బదులు నగదును ఇస్తే ఎలా ఉంటుందో యోచించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

రేషన్ షాపుల డీలర్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ఆయన శనివారం అధికారులతో మంతనాలు జరిపారు. ప్రజాధనంతో భారీగా నిత్యావసర వస్తువులను అందిస్తున్నా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో చేరడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు నగదు బదీలీని వర్తింపజేస్తే సరైన ఫలితాలు ఉంటాయా అని అడిగారు. డీలర్ల సమ్మె వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు.