జగన్ గారూ, మాకూ 10 వేలు ఇవ్వండి.. రిక్షా కార్మికుల ధర్నా - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ గారూ, మాకూ 10 వేలు ఇవ్వండి.. రిక్షా కార్మికుల ధర్నా

October 25, 2019

CM please be kind to us .. rickshaw workers protest0

‘సీఎంగారూ మా మీద కూడా దయచూపండి.. ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు ఇస్తున్నట్లే  మాకూ పెన్షన్లు ఇవ్వండి’ అంటూ చెమటోడ్చి రిక్షా తొక్కే కార్మికులు ధర్నాకు దిగారు. వైఎస్ఆర్ భరోసా పథకం కింద రిక్షా కార్మికులకు ప్రతి ఏడాది రూ.10 వేలు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా బలిజిపేట సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. 

50 సంవత్సరాలు పైబడిన కార్మికులకు సామాజిక పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. సొంత వాహనాలు ఉన్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల అందించే వాహనమిత్ర పథకాన్ని జగన్ ఇటీవల ప్రారంభించడం తెలిసిందే.