పవన్ పాటకు సీఎం రమేష్ అదిరిపోయే స్టెప్పులు.!(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ పాటకు సీఎం రమేష్ అదిరిపోయే స్టెప్పులు.!(వీడియో)

November 25, 2019

ఎప్పుడూ రాజకీయాలు, వ్యాపారాలతో బిజీగా గడిపే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ డ్యాన్సులతో అదరగొట్టాడు. పవన్ కల్యాన్ అత్తారింటికి దారేది సినిమా పాటకు ఆయన భార్యతో కలిసి స్టెప్పులేశారు.ఆయన కొడుకు రిత్విక్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సందర్భంగా జరిగిన వేడుకల్లో సరదాగా కనిపించారు. వీరిని చూసిన అతిథులంతా ఈలలు కొడుతూ ఎంకరేజ్ చేశారు. ఈ కపుల్ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

సీఎం రమేశ్  కుమారుడు రిత్విక్‌‌‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త తూళ్లూరి రాజా కూతురు పూజ నిశ్చితార్థం ఆదివారం రాత్రి దుబాయ్‌లోని రస్ అల్ ఖైమాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అతిథుల కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు కూడా ముందుగానే బుక్ చేశారు. నిశ్చితార్థ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో అంతా స్టెప్పులు వేశారు. దీంట్లో సీఎం రమేష్ దంపతులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కాగా తూళ్లూరి రాజా కుటుంబంలో అంతా వైద్య వృత్తిలోనే ఉన్నారు. వీరంతా అమెరికాలోనే తమ నివాసం ఏర్పాటు చేసుకున్నారు.