సీఎం కొడుకు సినిమా టికెట్లు.. కార్యకర్తల ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం కొడుకు సినిమా టికెట్లు.. కార్యకర్తల ఆగ్రహం

May 23, 2022

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూమారుడు, హీరో ఉదయ నిధి స్టాలిన్‌ ఇటీవలే ఇక నుంచి సినిమాలు చేయనని, పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగుతానని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన నటించిన ‘నెంజుకు నీధి’ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్‌‌లో భారీ విజయాన్ని సాధించిన ‘ఆర్టికల్‌ 15’ సినిమా తమిళంలో ‘నెంజుకు నీధి’ పేరుతో రీమేక్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 20వ తేదీన విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. సినిమా టికెట్లు బాగా అమ్ముడుపోవాలని కొంతమంది అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను బాగా వేధిస్తున్నారని కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలో మంత్రి నాజర్‌ ఆదివారం తిరువళ్లూరు జిల్లా కరుణాకరచ్చేరి, అముదూర్‌మేడు, రామాపురం మధ్య 5.71 కోట్లు వ్యయంతో కూవం నదిపై నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణపు పనులకు కలెక్టర్‌ ఆల్బీ జాన్‌వర్గీన్‌, ఎమ్మెల్యే కృష్ణస్వామితో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి నాజర్ మాట్లాడుతూ.. ”ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ నటించిన ‘నింజు నీధి’ సినిమా టికెట్ల విక్రయాల విషయంలో కొంతమంది నేతలు టార్గెట్‌ పెట్టి, కార్యకర్తలను వేధిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అవన్నీ అవాస్తవాలు. కావాలనే కొందరు ఉదయనిధి స్టాలిన్‌పై తప్పుడు వార్తలు రాస్తున్నారు. కూవం నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి సుమారు 7.5 మీటర్ల వెడల్సు. 83 మీటర్లు పొడవు ఉంటుంది” అని ఆయన అన్నారు.