సీబీఐపై ఆంక్షలు.. ఉద్దవ్ సంచలన నిర్ణయం! - MicTv.in - Telugu News
mictv telugu

సీబీఐపై ఆంక్షలు.. ఉద్దవ్ సంచలన నిర్ణయం!

October 22, 2020

ngngfn

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)పై మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు విధించాడు. ఇకపై సీబీఐ అధికారులు మహారాష్ట్రలో ఏ కేసు దర్యాప్తు చేయాలన్న ముందుగా అక్కడి ప్రభుత్వ అనుమతిని తీసుకోవాలి. అలాగే వారు దర్యాప్తు చేస్తున్న కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకు అందజేయాల్సి ఉంటుంది. ఈమేరకు బుధవారం అర్థరాత్రి  ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆ కేసు పూర్వాపరాలను పరిశీలించిన తరువాత.. హోం మంత్రిత్వ శాఖ అధికారులు అనుమతి ఇస్తేనే సీబీఐ అధికారులు దర్యాప్తు చేయాలి. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజధాని ముంబై సంచలన కేసులకు కేంద్రబిందువు అవుతోంది. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా కేసు విచారణ జరుగుతుండగా తాజాగా టీఆర్పీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును కూడా సీబీఐ విచారించాలని ప్రజల నుండి డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐపై ఆంక్షలు విధించడం రేపుతోంది.