ఒవైసీ ఏదోరోజు హనుమాన్ చాలీసా చదువుతారు.. యోగీ - MicTv.in - Telugu News
mictv telugu

ఒవైసీ ఏదోరోజు హనుమాన్ చాలీసా చదువుతారు.. యోగీ

February 4, 2020

CM Yogi.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఏదో ఒక రోజు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా హనుమాన్ చాలీసా చదువుతారని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఇవాళ ఆయన కిరారిలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పుడిప్పుడే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టారు. ఇక ముందు ఏం జరుగుతుందో కూడా మీకే తెలుస్తుంది.  ఎంఐఎం నేత ఓవైసీ కూడా ఏదో ఒక రోజు హనుమాన్ చాలీసా చదివితే మనం చూస్తాం. ఓట్లు అడగడానికి వచ్చే ఆప్ నేతలను హనుమాన్ చలీసా చదవండని చెప్పండి. లేదా చెట్టు మీద తలక్రిందులుగా వేలాడదీయండి. వారు ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం’ అని యోగీ అన్నారు. 

ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలను యోగీ ఖండించారు. సీఏఏ నిరసనకారులకు ఇలాంటి నేతలు బిర్యానీలు అందిస్తున్నారని ఆరోపించారు. మరో వైపు హనుమాన్ చాలీసా వల్లిస్తున్నారని యోగి మండిపడ్డారు. కాగా, యోగిపై ప్రచార నిషేధం విధించాలని ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.