ఏపీ రాజధాని ఏదన్న అనుమానాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి పటాపంచలు చేశారు. వైజాగే నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అని ఢిల్లీలో విస్పష్టంగా ప్రకటించారు. ‘‘విశాఖ త్వరలో రాజధాని కాబోతోంది. నేను కూడా కొద్ది నెలల్లో అక్కడికే షిఫ్ట్ అవుతున్నా. మిమ్మల్ని మళ్లీ అక్కడే కలుస్తా’’ అని ఆయన ఇన్వెస్టర్ల సమావేశంలో అన్నారు.
విశాఖలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడారు. ‘‘విశాఖ నుంచి త్వరలోనే పాలనా వ్యవహారాలు సాగుతాయి. మార్చి 3,4 న విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. మీరందరూ రావాలి. పెట్టుబడిదారుల సంక్షేమం కోసం మేం చాలా చర్యలు తీసుకుంటున్నాం.
సింగిల్ విండో విధానంలో 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం’’ అని సీఎం చెప్పారు. ఏపీ 11.43 శాతం వృద్ధి రేటుతో ఏపీ దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని, ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీనే నంబర్ వన్ అని చెప్పారు. కీలకమైన 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో మూడు ఏపీకే దక్కడం దీనికి నిదర్శమని చెప్పారు. రాజధానిపై సీఎం ప్రకటన నేపథ్యంలో ఉగాది నుంచే విశాఖ నుంచి పాలన సాగుతుందని వార్తలు వస్తున్నాయి. మంత్రులు, వైసీపీ నేతలు ఇప్పటికే వైజాగ్‌లో ఇళ్లు వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
కోడికత్తి కేసులో జగన్ కూడా కోర్టుకు..
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. శ్రీధర్ రెడ్డి ఆడియో కలకలం!