cm ys jagan Slams Pawan Kalyan Over wives Issue
mictv telugu

ఈ భార్య కాకపోతే ఆ భార్య.. పవన్‌పై జగన్ ఫైర్

December 30, 2022

Andhra Pradesh chief minister jagan mohan reddy slams pawan kalyan on wives issue

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం ఎంతో కృషి చేస్తున్న తన ప్రభుత్వంపై అనుచిత విమర్శలు చేస్తున్నారన్నారు. ఆయన శుక్రవారం నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ, తాండవ-ఏలేరు ఎత్తిపోత కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ప్రసంగించారు.

‘’14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక్క మంచిపని చేసినట్లు ఒక్క ఆధారమన్నా ఉందా? ఆన్నీ తానే చేశానంటున్న ఆయన పీవీ సింధుకు ఆట నేర్పింది కూడా తానేనంటాడు’’ అని బాబును ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ.. ‘‘ఇంకో మనిషి తన దత్తతండ్రిని నెత్తినపెట్టుకుని ఊరేగుతున్నాడు. బాబు, పవన్ స్టైయిల్ ఒక్కటే. ఈ రాష్ట్రం కాకపోతే ఆ రా ష్ట్రం. ఆ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు. ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీతో. ఈ భార్య కాకపోతే ఆ భార్యతో. వీరి స్వరూపం చూస్తే, ఇదేం ఖర్మరా మన రాష్ట్రానికి అనిపిస్తుంది. పద్నాలుగేళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చిన పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. ఆయనకు నిర్మాత, డైరెక్టర్ చంద్రబాబు. బాబు స్క్రిప్టు ప్రకారం నటించడమే ఆయన పని’’ అని అన్నారు. ఉత్తరాంధ్రకు అభివృద్ధికి తన ప్రభుత్వం ఎంతో పాటుబడుతోందని చెప్పుకొచ్చారు. పలు మెడికల్ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు తెచ్చామని, త్వరలోనే ట్రైబల్ యూనివర్సిటీ కూడా వస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి :

పీవీ సింధుకు కూడా చంద్రబాబే ఆట నేర్పించా అంటారు : జగన్

తల్లి పోయిన దు:ఖంలోనూ మోదీ విధులు..విశ్రాంతి తీసుకోవాలని మమతా సూచన

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్‎న్యూస్..మరో 30 స్పెషల్ ట్రైన్స్…