ఎల్లుండి వైజాగ్‌కు సీఎం జగన్.. భారీ సంఖ్యలో లబ్దిదారులు - MicTv.in - Telugu News
mictv telugu

ఎల్లుండి వైజాగ్‌కు సీఎం జగన్.. భారీ సంఖ్యలో లబ్దిదారులు

April 26, 2022

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 28న విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. నగర శివారులో 300 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాల పట్టాలను 9 వేల మంది లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం 72 లేఅవుట్లలో అధికారులు ఇళ్ల స్థలాలను సిద్ధం చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లను చేసింది. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో ప్రకటించింది.