ముఖ్యమంత్రిగా కాదు అభిమానిగా విధులు నిర్వహించిండు - MicTv.in - Telugu News
mictv telugu

ముఖ్యమంత్రిగా కాదు అభిమానిగా విధులు నిర్వహించిండు

June 14, 2017


దిల్ అంటే మన తెలంగాణ సిఎం కేసీఆర్ దే. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ సినారె పుస్తకాలు కూడా చదివినవాడు కాబట్టే ఆయన రాతలకు ప్రియ శిష్యుడెప్పుడో అయ్యాడు. చాలా సార్లు ఆయన ఎక్కడ మాట్లాడినా సినారె రాసిన పదాలు, వాక్యాలను కోట్ చేస్తాడు కేసీఆర్. అందుకే సినారె అంత్యక్రియల్లో సిఎం గా కాకుండా ఆయన అభిమానిగా అన్నీ తానై ముందరుండి మరీ చూస్కున్నాడు. సావుకు ఏం తక్కువ పడకుండ చాలా ఓపిగ్గా అన్ని దగ్గరుండి చూస్కున్నాడు. ఒక సిఎం ననే సంగతి కూడా మర్చిపోయి మామూలు మనిషిలానే అక్కడ పనులన్నీ తన భుజం మీద ఎత్తుకొని చూస్కున్నాడు. ఎలాంటి గడ్ బడ్ లు కాకుండా కాష్టం అయిందాక దెగ్గరుండి కుండ, కంపురం, పూలు, నెయ్యి.., ఇట్ల అన్నిటిని కుద్దుగ కేసీఆర్ సారే తెప్పించిండట.

#CMKCR Participates in #CNarayanaReddy's Last Funeral | #TNews

Posted by TNews Telugu on Wednesday, 14 June 2017

 

సినారెకు సొంత తమ్ముని లెక్క కడసూపు పన్లన్ని దెగ్గరుండి సూస్కున్నడంటే సిఎం కేసీఆర్ సార్ తారీఫ్ ఎంత జేశిన తక్కవే అని అక్కడికి వచ్చిన జనాలు అనకున్నరు. వేరే వేరే సిఎంలైతే ‘ మేము ముఖ్యమంత్రులమనే ’ ధీమా కొద్ది వెనక బాడీగార్డులను పెట్టుకొని కొశ్శ కట్టె నిలబడ్డట్టు నిలబడి పీన్గు మీది కాసిన్ని పూలు చల్లి, కండ్లల్ల నీళ్లొచ్చి ఒల్కి పోయినట్టు ఒత్తుకొని మెల్లెగ జారుకునేటోల్లు. కనీ సూశిర్రా తెలంగాణా సిఎం బాద్దూర్ పని… తాతల కాలం నుంచి అస్తున్న రికార్డులను బ్రేకు జేశి సావులకు వోయిన జాగల గూడ సిఎం బీఎం ఏందన్నట్టు ఒక సాదా సీదా మన్షి లెక్కే మసిలిండు. గ్రేటు కదా తెలంగాణా సిఎం కేసీఆర్.