Home > Featured > సీఎం పెళ్లి అయిపోయింది..ఫోటోలు ఇవిగో

సీఎం పెళ్లి అయిపోయింది..ఫోటోలు ఇవిగో

పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్ నేడు రెండో పెళ్లి చేసుకున్నారు. చండీగఢ్‌లోని గురుద్వారాలో అతికొద్ది మంది సమక్షంలో డాక్టర్‌ గురుప్రీత్ కౌర్‌ను కాసేపటిక్రితమే ఆయన పరిణయమాడారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

పోస్ట్ చేసిన ఫోటోలో భగవంత్ మాన్ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఇందులో బంగారు వర్ణం దుస్తులు, పసుపు రంగు టర్బన్‌ను ధరించి వెలిగిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భగవంత్‌మాన్ వివాహం సిక్కుల సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగింది. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.

మరోపక్క సీఎం భగవంత్ మాన్ వివాహానికి ఆప్‌ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కుటుంబంతోపాటు ఇతర పార్టీ నేతలు హాజరైయ్యారు. ఈరోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్‌ మాన్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువ మొదలైంది. భగవంత్ మాన్ మొదట ఇంద్రప్రీత్ కౌర్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు సంతానం. ఆరేళ్ల తర్వాత 2015లో వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడాకులు తీసుకుంది.

Updated : 7 July 2022 3:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top