ఆత్మలను పలికించేదే అసలైన భాష
ఆ విలువ కరువైపోతే అది కంట శోష
వేదం ఖురాను బైబుల్ వీధిలోన పడతాయా
మతమేదైనా ఒకటేలే ప్రతీ మనిషి శ్వాస
అవినీతికి పీఠం వేసి అభ్యుదయం కూడ్చిన జాతి
ఇకనైనా కళ్ళు నులుముకో ఇది రక్త ఘోష
నానాటికి ఏమీ పతనం నాలో ఒక తీరని మదనం
అటు పతనం ఇటు మదనం
ప్రభుత్వాలు ఏమైతేమి పైసాపై ధ్యాస
తలనెరిసి పోతే దిగులు తనువూరి పోతే దిగులు
అది దిగులు కాదు సినారె తుది జీవితాశ…
ఇలాంటివెన్నోగజల్స్ సినారె కలం నుండి అనంతంగా జాలువారాయి. అలాంటి గజళ్ళను తన గానంతో మనలను సమ్మోహితులను చేయటానికి నందన్ బొబ్బిలి గారు పూనుకోవడం సినారె అనే పూర్ణ చంద్రుడికి నూలుపోగు లాంటిది!
గజల్ నందనుని గీతాంజలి
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు రవీంద్ర భారతి వేదికగా స్వర్గీయ డాక్టర్ సి. నారాయణ రెడ్డి గజల్స్ గానామృత కన్నుల పండుగ. ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు నందన్ రాజ్ బొబ్బిలి గారు ఆలపిస్తున్న ఈ సుమధుర గాన గజల్ కార్యక్రమం మీ రాకతో మరింత శోభాయమానమౌతుంది.
తేది 23-06-2017
VENUE : రవీంద్ర భారతి మెయిన్ హాల్ ( 5:00 PM )