co-living trend in Hyderabad agencies offering especial packages
mictv telugu

  కో-లివింగ్ కు ఫుల్ డిమాండ్…హైదరాబాద్ లో స్పెషల్ ప్యాకేజీలు 

November 1, 2022

కరోనా తర్వాత జనాలు మళ్ళీ మామూలు అవుతున్నారు. ముఖ్యంగా ఐటీ సెక్టార్ తిరిగి గాడిలో పడుతోంది. నెమ్మది నెమ్మదిగా ఆల్ డే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడడా మొదలవుతోంది. దీంతో ఐటీ సంస్థలు మళ్ళీ ఉద్యోగులతో కళకళలాడుతున్నాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ కాలం గడిచిపోయింది. ఆఫీస్ వర్క్ మొదలవుతోంది. ప్రస్తుతం వారానికి రెండు, మూడు రోజులే పని చేస్తున్నా..త్వరలో వారం మొత్తం ఆఫీస్ కు వచ్చేలా కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో ఎంప్లాయిస్ అందరూ హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. ఐటీ కారిడార్ సెక్టార్ చుట్టుపక్కల షెల్టర్ కోసం వెతుకులాటలు ప్రారంభం అయింది. పెళ్ళయిన వాళ్ళు ఇళ్ళ కోసం వెతుకుంటున్నారు. అయితే యంగ్ టెకీలు మాత్రం హాస్టళ్ళు, అద్దెగదుల కోసం వెతకడం లేదుట. వాటి కంటే కో లివింగ్ రూమ్స్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారుట.

కో-లివింగ్ అనేది రెసిడెన్షియల్ కమ్యూనిటీ లివింగ్ మోడల్. అంటే ఒకే రకం అభిరుచి, అలవాట్లు ఉన్న వ్యక్తులు రూమ్ ను షేర్ చేసుకుంటారు. దీంతో కో-లివింగ్ స్పేస్ ల కోసం డిమాండ్ పెరుగుతోంది. తక్కువ అద్దె ఉండడంతో పాటూ అన్ని సౌకర్యాలు అందిస్తుండటం, మాల్స్, రెస్టారెంట్స్ కు దగ్గరగా ఉండడంతో టెక్కీలు వీటికే ఎక్కువ ఓటు వేస్తున్నారు.

కో-లివింగ్ స్పేస్ ల ఎక్కువ డిమాండ్ ఉండడంతో ఏజెన్సీలు క్యాష్ చేసుకునేందుకు కొత్త వెంచర్ లతో ముందుకు వస్తున్నాయి. 8 వేల నుంచి 15వేల వరకు డబ్బులు తీసుకుంటూ వాళ్ళకు ఇష్టమైన లివింగ్ రూమ్స్ను ఆఫర్ చేస్తున్నాయి. సహజీవనం అనేది ఇప్పటి ట్రెండ్. మిలీనియల్స్ లో బాగా ఫేమస్ అయింది. హైదరాబాద్ ఐటీ కారిడార్స్ ఏరియాలు లివింగ్ రూమ్స్ కు అనుకూలంగా ఉన్నాయి. దానికి అదనంగా వాటిని నిర్వహించేవారు హైటెక్ హంగులను కూడా జోడిస్తున్నారు. తక్కువ టైమ్ లో ఆఫీసులకు వెళ్ళొచ్చు అని కూడా చెబుతున్నారు. దాదాపుగా అందరు టెకీలు వీటినే సెలెక్ట్ చేసుకుంటున్నారు.

బెంగళూరుకు చెందిన ఓ సంస్థ హైదరాబాద్ లోని మాదాపూర్, గచ్చిబౌలీ, జూబ్లీహిల్స్ లో 300 పడకలతో కూడిన 5 కో-లివింగ్ స్పేస్ లను నిర్వహిస్తోంది. నెలకు ఒక్కో బెడ్ కు 9 వేల నుంచీ 12వేల వరకు వసూలు చేస్తోంది. కో-లివింగ్ ఇన్ ఇండియా లో 2021 చివరి నాటికి 2.1 లక్షల కో-లివింగ్ స్పేస్ లు ఉంటే 2024కు అది 4.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా..