కడప వాళ్లయితే మాత్రం ఇంతలా కొడతారా? - MicTv.in - Telugu News
mictv telugu

కడప వాళ్లయితే మాత్రం ఇంతలా కొడతారా?

April 18, 2022

01

‘మాది కడప. ఏం చేస్కుంటారో చేస్కోండి’ అంటూ ఓ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రెచ్చిపోయిన ఉదంతం హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాలు.. దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన సాయి చరణ్ అనే విద్యార్ధి అశోక్ నగర్‌లో ఉన్న శిఖర కోచింగ్ సెంటర్‌కు వెళ్లాడు. గ్రూప్ 2 కి సంబంధించి డెమో వినాలని కోరాడు. దాంతో కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఢిల్లీబాబు అసహనానికి లోనై ‘నువ్వు విద్యార్ధివి కాదు. మా వివరాలు తెలుసుకోవడానికి వచ్చావు. మర్యాదగా ఏ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చావో చెప్పు’ అంటూ విద్యార్ధిపై చేయి చేసుకున్నాడు. దీంతో సాయిచరణ్ పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు రాగానే ఢిల్లీబాబు మరింత రెచ్చిపోతూ ‘నాది కడప. ఏం చేస్కుంటారో చేస్కోండి’ అంటూ దురుసుగా ప్రవర్తించాడు. అనంతరం పోలీసు విధులకు ఆటంకం కలిగించాడనే కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఢిల్లీబాబును అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌లో బాగా చితక్కొట్టి ఆదివారం రాత్రి మేజిస్ట్రేటు ముందు హాజరుపరిచారు. ఢిల్లీ బాబు ఒంటిపై ఉన్న గాయాలను చూసి ‘మరీ ఇంతలా కొడ్తారా’? అని పోలీసులపై మండిపడ్డారు.