పిడికిలి బిగించిన సింగరేణి .. దేశవ్యాప్తంగా బొగ్గు సమ్మె - MicTv.in - Telugu News
mictv telugu

పిడికిలి బిగించిన సింగరేణి .. దేశవ్యాప్తంగా బొగ్గు సమ్మె

July 2, 2020

Coal India trade unions including on 3-day strike as talks with govt fail

బొగ్గు గనులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె ప్రారంభించాయి. మూడు రోజలు సమ్మెతో వివిధ రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులన్నీ మూతపడ్డాయి. సింగరేణిలోనూ కార్యకలాపాలు స్తంభించాయి. కార్మికులు, ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెలో టీఆర్ఎస్ అనుంబంధ సంస్థ కార్మిక సంఘం టీబీజీకేఎస్ కూడా పాల్గొంటోంది. అయితే తాము ఒక్కరోజు మాత్రమే సమ్మె చేస్తామని చెప్పింది. 

మోదీ ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. కార్మిక చట్టాల సవరణను వెనక్కి తీసుకోవాలని, హెచ్పీసీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మెలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎ్‌స, సీఐటీయూ, బీఎంఎస్‌, ఇఫ్టూ తదితర సంఘాలు పాల్గొంటున్నాయి. వేల మంది సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి.