బొగ్గుగని లూటీ.. అందినకాడికి ఎత్తుకెళ్లిన జనం (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

బొగ్గుగని లూటీ.. అందినకాడికి ఎత్తుకెళ్లిన జనం (వీడియో)

May 21, 2022

కాలం మారుతోంది. బంగారాన్నే కాదు, నల్ల బంగారాన్నీ చోరీ చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు గనిని జనం లూటీ చేశారు. రెండు రోజుల కిందట కోర్బాలోని దీప్కా, గెవ్రా ఓపెన్ కాస్ట్ గనిలో జరిగిన ఈ దోపిడీ వీడియోల్ అవుతోంది. సమీప గ్రామాల జనం గంపలు, తట్టలతు తీసుకొచ్చి బొగ్గు నిపుంకుని వెళ్లిపోయారు.
గని రక్షణపై ఇదివరకే అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

 

గనిలోకి బయటి వ్యక్తులు రాకుండా కందకాలు తవ్వాలని ఫిబ్రవరిలోనే కోరినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. గని వద్ద చెక్ పోస్ట్ కూడా లేకపోవడంతో లూటీ సులువైంది. సీఐఎస్ఎఫ్ బలగాలు, త్రిపుర రైఫిల్స్ బలగాలు గనికి రక్షణ కల్పిస్తున్నా, ఈ దోపిడీ ఎలా జరిగిందో అర్థం కావడం లేదని అధికారులు అంటున్నారు.