బొగ్గు మెక్కావు కదా.. మూడేళ్లు జైల్లో మగ్గు.. - MicTv.in - Telugu News
mictv telugu

బొగ్గు మెక్కావు కదా.. మూడేళ్లు జైల్లో మగ్గు..

December 16, 2017

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణంలో పాపాలు పండుతున్నాయి. ఈ కుంభకోణం కేసులో జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అతనికి జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా కూడా వడ్డిస్తూ శనివారం తీర్పు వెలువరించింది. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తాకు కూడా కోర్టు మూడేళ్ల జైలు శిక్ష వేసి, రూ.1 లక్ష జరిమానా విధించింది. కోల్‌కతాకు చెందిన వినీ ఐరన్, స్టీల్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ (విసుల్‌) కంపెనీకి జార్ఖండ్‌లోని రాజారా నార్త్‌ బొగ్గు బ్లాకుల కేటాయింపుల అక్రమాలు జరిగాయని, ముడుపులు ముట్టాయని కేసు నమోదైన సంగతి తెలిసిందే.  ఈ కేసులో మధు కోడా, గుప్తాలతో పాటు జార్ఖండ్‌ మాజీ సీఎస్‌ ఏకే బసు, విసులను సీబీఐ  కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది. అప్పట్లో  స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన వాస్తవాలను  నిజాలను అప్పటి ప్రధాని, బొగ్గు గనుల మంత్రి అయిన మన్మోహన్‌ సింగ్‌ కు చెప్పలేదని సీబీఐ తెలిపింది.

The court also imposed a fine of ₹25 lakhs on Madhu Koda and ₹1 lakh on H.C. Gupta