వర్షాకాలం వచ్చిందంటే చాలు పాములు ఇంట్లోకి వచ్చేస్తాయి. అందుకే మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ పాములు ఎక్కడో ఒక చోట నక్కి ఉంటాయి. మన ఇంట్లో చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఎందులోనైనా దాక్కుని ఉండవచ్చు. తాజాగా ఓ వ్యక్తి షూ లో నాగుపాము దూరిన సంఘటన ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇంత చిన్న షూ లో అంత పెద్ద పాము ఎలా నక్కి ఉందోనని వారు షాకు కు గురవుతున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ శివారులోని బొమ్మానకట్టెలో మంగళవారం చోటుచేసుకుంది. బొమ్మానకట్టెకు చెందిన మంజప్ప మంగళవారం ఉదయం ఇంటి బయట ఉంచిన ‘షూ’ వేసుకుందామని కదిలించేసరికి.. బుసకొడుతూ పైకి లేచింది.
దీంతో భయభ్రాంతులకు గురైన కుటుంబసభ్యులు వెంటనే బయటకు పరుగు తీశారు. దీని గురించి స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న స్నేక్ సోసైటీ సభ్యుడు కిరణ్.. పామును జాగ్రత్తగా బయటకు తీసి గ్రామానికి దూరంగా తీసుకెళ్లి వదిలివేశాడు. వర్షాకాలంలో షూ వేసుకునేముందు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని సూచించాడు.