Cobra standing on back of sleeping woman in field goes viral
mictv telugu

నిద్రిస్తున్న మహిళపై పడగ విప్పిన నాగుపాము.. చివరకు ఏం జరిగిందంటే?

August 28, 2022

 


మనలో చాలా మందికి పాములంటే చాలా భయం. పొరపాటున పాములు కన్పిస్తే.. దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించరు. కొన్నిసార్లు.. పాములు దారితప్పి మనుషుల ఆవాసాల్లోకి వస్తుంటాయి. అలాంటి కొన్ని సందర్భాలలో ఎక్కడ తమకు అపాయం కలుగచేస్తాయో అని పాములను చంపుతుంటారు. మరికొన్నిసార్లు పాము చేతిలో కాటుకు కూడా గురౌతుంటారు. ఇప్పటికే పాములకు సంబంధించిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా పొలంలో నిద్రిస్తున్న మహిళ వీపు మీద పాము ఎక్కి కూర్చుంది.

కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. మల్లాబాద్ కు చెందిన భాగమ్మ అనే మహిళ తన పొలంలో పడుకుంది. అప్పుడు ఆమె వీపు మీద పెద్ద నాగు పాము వచ్చి పడగ విప్పి కూర్చుంది. దాన్ని అక్కడున్న వారు చూసి,అరవడంతో మహిళకు మెళకువ వచ్చింది. ఈ క్రమంలో.. మహిళ వెంటనే భయంతో వణికిపోయింది. పాము మాత్రం పడగ విప్పుకుని, బుసలు కొడుతూ.. అక్కడ నిలబడి చూస్తుంది. ఆమె భయంతో ఆ భగవుంతుడిని పదే పదే తలుచుకుందట.

అయితే.. ఆ దేవుడు అనుగ్రహించాడో మరేంటో కానీ.. ఆ పాము కాసేపు అక్కడే ఉంది, ఆ తర్వాత వెళ్లిపోయింది. ఇదంతా అక్కడ గట్టుమీద ఉన్న ఓ బాలుడు సెల్‌ఫోన్ లో రికార్డు చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. నిజంగా ఆమెకు లక్ బాగానే ఉందని, కొంత మంది ఆమెకు ఇది పునర్జన్మ అంటూ కామెంట్లను పెడుతున్నారు.