చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ కోకా-కోలా కంపెనీ భాగస్వామ్యంతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. రియల్ మీ 10 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ కోకా కోలా ఎడిషన్ ను ఫిబ్రవరి 10న లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
కోకా-కోలా భాగస్వామ్యంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్ మీ 10 ప్రో కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త కలర్స్ తో, యూజర్ ఇంటర్ ఫేస్ (యూఐ)కీలక మార్పులు చేయనున్నారు. ఇది 5జీ స్మార్ట్ ఫోన్. కాగా ఇతర బ్రాండ్ భాగస్వామ్యం కోసం ఇతర కంపెనీలతో జతకట్టడం రియల్ మీకి ఇది మొదటిసారేం కాదు. గతేడాది మార్వెల్ భాగస్వామ్యంతో రియల్ మీ జీటీ నియో 3థోర్ ఎడిషన్ ను విడుదల చేసింది.
ఈ ఎడిషన్ ఫీచర్లు..
రియల్ మీ 10ప్రో కోకా-కోలా ఎడిషన్ ఫీచర్లు.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్ మీ ప్రో ఫీచర్లు ఒకటే. కాకపోతే కోకా-కోలా లోగోతో బ్లాక్ అండ్ రెడ్ డ్యుయల్ టోన్ కలర్స్లో ఆకర్షణీయంగా లాంచ్ చేస్తున్నది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో, 6.7 ఇంచ్ ఎల్ సీడీ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 685 5జీ, ఫుల్ హెచ్ డీ రెజల్యూషన్ తో రానుంది.
అయితే కోకా-కోలా బ్రాండ్ ప్రత్యేక ఎడిషన్ ఫోన్లు ఎక్కువ స్టోరేజీ 8జీబీ ర్యామ్, 128జీబీతో రానున్నాయి. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, ఫ్రంట్ 16 మెగా పిక్సెల్ సెల్ఫీ స్నాపర్ తో రానుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో, ఆండ్రాయిడ్ 13, 22 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రానుంది. ఈ ఫోన్ ధర పై స్పష్టత లేదు. భారత్ లో 20వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా.
ఇప్పటికే..
కోకా-కోలా భాగస్వామ్యంతో రావడం వల్ల ఫోన్ల ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. రియల్ మీ 10 ప్రో ప్లస్ 6జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ. 24,999, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ మోడల్ ధర 27,999గా ఉణ్నాయి. రియల్ మీ 10 ప్రో ప్లస్ ఫీచర్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్ వోసీ, 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చింది. ఫ్రంట్ అల్ట్రా వైడ్ 8 మెగా పిక్సెల్ కెమారా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో షూటర్ తో వచ్చింది.
ఇవి కూడా చదవండి :
నాసా రోవర్ ఛాలెంజ్ కు ఎంపికైన 6 మంది భారతీయ పిల్లలు!
సీఏ ఫలితాలు విడుదల..ఈ డైరెక్ట్ లింక్‌తో చెక్ చేసుకోండి..!!