కోకాకోలా పేరుతో ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ని భారత మార్కెట్లోకి శుక్రవారం లాంఛ్ చేసింది. ఫిబ్రవరి 14 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యే ఈ ఫోన్ ధర రూ. 20, 999గా ఉంది. రియల్ మీ 10 ప్రో స్పెషల్ 5జీ ఎడిషన్ అయిన ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ – 128 జీబీ స్టోరేజీ ఇస్తుంది. నల్లరంగుతో కోకా కోలా లోగో కలిగిన ఈ ఫోన్.. 33 మెగావాట్ల చార్జింగ్ సపోర్టుతో 5000 మెగా హెడ్జ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. ఫిబ్రవరి 14 మధ్యాహ్నం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్ మీ స్వంత వెబ్ సైటులో కొనుక్కోవచ్చు.
ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో కస్టమైజ్ చేసిన ఈ ఫోన్ 6.72 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ కెమెరా, శాంసంగ్ హెచ్ఎం6 ప్రధాన కెమెరాలతో పాటు 2 ఎంపీల పోర్ట్రెయిట్ సెన్సార్ కలిగి ఉంది. ముందు భాగంలో 16 ఎంపీల సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్‌లో ఉన్న రెండు ప్రత్యేకతలు వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కెమెరా సెట్టింగ్స్‌లో 1980ల కాలం నాటి కోలా ఫిల్టర్ ఉంటుంది. దాని కింద తీసుకునే ఫోటోలు అచ్చం 1980లలో తీసినట్టుగా కనిపిస్తాయి. మరో విశేషం ఏంటంటే.. కెమెరాతో ఫోటో తీసేటప్పుడు షట్టర్ సౌండుకు బదులుగా కోకా కోలా బాటిల్ మూత తీసిన శబ్దం వినపడడం.