కొబ్బెరినూనె కొంటున్నారా? ఆ బ్రాండ్లపై నిషేధం ఉంది, జాగ్రత్త! - MicTv.in - Telugu News
mictv telugu

కొబ్బెరినూనె కొంటున్నారా? ఆ బ్రాండ్లపై నిషేధం ఉంది, జాగ్రత్త!

February 3, 2020

అన్ని సరుకుల్లో కల్తీ ఉన్నట్లే కొబ్బరినూనెలోనూ కల్తీ నూనెలు ఉంటాయి. బ్రాండెడ్ నూనె అయితే కల్తీ ఉండదులే అనుకోవడం పొరపాటే. పేరుమోసిన కంపెనీలు కూడా కాసుల కక్కర్తితో కోకోనట్‌ ఆయిల్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్ వంటివాటిని కలిపేస్తున్నాయి. ఈ సంగతిని కొబ్బరి అడ్డా అయిన కేరళ ప్రభుత్వం గుర్తించింది. పలు బ్రాండ్లను పరీక్షించి ఏకంగా 42 బ్రాండ్లపై నిషేధం విధించింది. తలకు రాసుకునే నూనెతోపాటు, వంటలకు వాడే కొబ్బరి నూనెలను కూడా వీటిలో ఉన్నాయి. ఆ కంపెనీలు సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తెలిపింది. నిషేధ ఉత్పత్తుల్లో అత్యధికం కేరళలో తయారవుతున్నవే ఉన్నాయి. ముఖ్యంగా కేరా కంపెనీలు చెందిన చాలా బ్రాండ్లపై వేటేశారు. 

నిషేధిత జాబితాలోని బ్రాండ్లు..
ఎంసీసీ ప్యూర్, ప్యూర్ రోటరీ కోకోనట్ ఫుడ్ ప్రొడక్ట్స్,  కేరా పవిత్రం, కేరా క్రిస్టల్, కేరళ తృప్తి, తారా, కేరా స్వర్ణంయ,  కేరా కేర్, కేరా రుచి, కేరావిత ప్యూర్, కేరా సిల్వర్, కేరా లీఫ్, కోకో లైక్, కేరా తీరం,  కేరళ డ్రాప్, రాణి ఆయిల్ మిల్ చంగనస్సేరి, స్వదేశీ చక్కిలతియ నాదాన్ వెల్లిచెన్న, కట్టపన,  ఏజే అండ్ సన్స్ త్రిస్సూర్, ఎంకేఎస్ ఆయిల్ ట్రేడర్స్ ఎర్నాకుళం, మదర్ టచ్, పీఎస్‌కే, కేరళ డ్రాప్ లివ్ హెల్దీ అండ్ వైజ్, కోకో హరితం, సెంట్రల్ ట్రేడింగ్ కంపెనీ కైతకాడ్, కోకోల్యాండ్, కేరా సన్, సూర్య , అయిల్యం, సౌభాగ్య, వల్లువనాడ్, సురభి,  కైరళి, ఎవర్ గ్రీన్, కేపీఎస్ గోల్డ్, మెమొరీస్ 94, సిటీస్ కైరళి గోల్డ్, గ్రీన్ లైక్, , ప్రీమియం.